ఇటీవల హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుల ప్రస్తావనపై వస్తున్న వార్తలను తల్లి రాధిక ఖండించారు. తాను మాల సామాజిక వర్గంలో జన్మించానని, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో తన వివాహం జరిగిందని ఆమె తెలిపారు. తనకు మగ్గురు సంతానమని... మూడో బిడ్డ పుట్టిన అనంతరం, కుటుంబ కలహాల నేపథ్యంలో తాము విడాకులు తీసుకున్నట్లు రాధిక తెలిపారు. తన కులం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు.