ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్పై వేటుపడింది. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్ష పదవి నుంచి దయాశంకర్ను తొలగించారు. పార్టీ పదవులన్నింటి నుంచి దయాశంకర్ను తొలగిస్తున్నట్టు బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు.