లోక్సభ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది మండిపడ్డారు. సభలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని ఆయన తెలిపారు. కాని కెమెరాలు ఆపేశారని, ఇది నాగరిక సమాజం లక్షణమా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ఎమర్జెన్సీ కాలంలో జరిగాయన్నారు. ఇలా జరుగుతున్నప్పుడు పార్లమెంటులో తమకు పనేం ఉంటుందని ఆయన అన్నారు. అందుకే తాము వాకౌట్ చేసి వచ్చామని దినేష్ త్రివేది చెప్పారు. ఈ రోజు తాము చాలా బాధపడుతున్నామన్నారు. ప్రజాస్వామ్యం ఓడిపోయింది, బిల్లు పాసైంది అని దినేష్ త్రివేది అన్నారు.
Published Tue, Feb 18 2014 6:01 PM | Last Updated on Wed, Mar 20 2024 2:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement