బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేయడం, టీడీపీ సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం ప్రగతిభవన్‌లో శుక్రవారం రాత్రి సమీక్షించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్‌ను అగౌరవపరిచేలా వ్యవహరించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయకూడదని మంత్రులను కేసీఆర్ ప్రశ్నించినట్టుగా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.