పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఏయేడుకాయేడు ఏక కాలంలో నిధులు ఇవ్వకపోవడం.. దఫదఫాలుగా ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో బకాయిలు రెట్టింపవుతున్నాయి. 2016–17 వార్షికసంవత్సరం మరో పక్షం రోజుల్లో ముగియనుంది