మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేశారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు విషయం వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశమైంది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.