ప్రపంచాన్ని గడగడలాడించిన వన్నాక్రై రాన్సమ్ వేర్ ముప్పు తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్నారేమో.. ఈ భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంకా దీని కథ ముగియలేదని, ఏ క్షణానైనా మళ్లీ ఈ సైబర్ దాడి పొంచుకురావచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహల్ చెప్పారు.