తెలంగాణ బిల్లును, జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టేందుకు ముందుగా అనుకున్న ముహూర్తం కాస్తా తాజాగా మారిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం పొందాకే బిల్లును, నివేదికను కేబినెట్ ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశానికి పంపి అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం కోసం ప్రయత్నించనున్నారు.