‘తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పక్షం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఉద్యానవన పంటలూ ఎండిపోవడం ఖాయం. గ్రామాలు, పట్టణాల్లోనూ తాగునీటి ఎద్దడి నెలకొంది. నిధులు లేకపోవడం వల్ల సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నాం.