ఎండీఎస్‌ కౌన్సిలింగ్‌పై హైకోర్టు ఆదేశాలు | high-court-orders-on-mds-counseling | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 9 2014 8:53 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ఎండీఎస్‌ కౌన్సిలింగ్‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎండీఎస్‌ కీలో తప్పులపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. కీలో 7 ప్రశ్నలకు తప్పుడు జవాబులిచ్చినట్లు విద్యార్థులు కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌ లేదా విజయవాడలో ఉన్న ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు కీని నివేదించాలని కోర్టు ఆదేశించింది. సంబంధిత ప్రొఫెసర్‌ లేదా హెచ్‌ఓడీలతో మరోసారి అభ్యంతరాలను పరిశీలించాలని కోర్టు తెలిపింది. ఈ వ్యవహారం తేలాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రేపటి నుంచి జరగవలసిన ఎండీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement