అక్రమ ఆయుధాల వ్యాపారం పెరిగింది: సీపీ | Illegal weapon Business Increased in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 14 2013 3:44 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయుధాలు తరలిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ అరిఫ్‌ ముఠాను అరెస్ట్ చేసినట్టు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అరిఫ్‌ సహా 9మంది అరెస్టు చేసినట్టు ఆయన ధ్రువీకరించారు. వీరి నుంచి 8 ఆయుధాలు, 9వాహనాలు, రూ.26వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో అక్రమ ఆయుధాల వ్యాపారం ఈ మధ్య పెరిగిందని తెలిపారు. అక్రమ ఆయుధాలు విక్రయించినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయుధాలు కొనుగోలు చేసేవారిలో ఎక్కువ మంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులేనని వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement