‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటే ఎస్సీ వర్గీకరణకు చట్టబ ద్ధత కష్టం కాదు. కావాల్సిన పనులను ఇరువురూ కలసి చేసుకుంటున్నారు. వర్గీకరణ కోసం వారు ఎందుకు కలవడం లేదు’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని, డప్పుకు, చెప్పుకు రూ.రెండు వేల పింఛన్ ఇవ్వాలనే డిమాండ్‌తో తెలంగాణ ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డితో పాటు కడియం శ్రీహరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్త శుద్ధితో ఉన్నారని, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకతీతంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తేనే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు.
Published Thu, Dec 29 2016 7:23 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM