తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు. కర్ణాటక హైకోర్టు ప్రాంగణంలో కాసేపు హై డ్రామా చోటు చేసుకుంది. తొలుత జయలలితకు బెయిల్ మంజూరైనట్టుగా వార్తలు వెలువడ్డాయి. తమిళ మీడియా అత్యుత్సాహం చూపడంతో నిజమేననుకుని జాతీయ మీడియా కూడా వార్తలు వెలువడ్డాయి. జయ మద్దతు దారులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో కథ మారిపోయింది. జయలలితతో పాటు ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.