తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 9.20 గంటలకు సురేంద్రపురికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్నారు.