తన బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేకహోదాపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.