రెడీమేడ్స్ అయితే ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. ఇవి నచ్చనివారైతే టైలర్ దగ్గరకు వెళ్లి దుస్తులు కుట్టించుకుంటారు. టైలర్ పనితనంపైనే డ్రెస్ తుది రూపు ఆధారపడి ఉంటుంది. కొలతల్లో ఖచ్చితత్వంతోపాటు డ్రెస్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో ముందే చూసుకోగలిగితే.. ప్రీమియం వస్త్రాల పంపిణీలో ఉన్న జార్జియా గుల్లిని ఫ్యాషన్స్ ఈ సేవలను భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన కొటియోర్ స్టోర్లలో టచ్ స్క్రీన్ అనే ప్రత్యేక పరికరం ముందు కస్టమర్ నిలుచుంటే చాలు. మూడు నిముషాల్లో 3డీ రూపంలో కొలతలు తీసుకుంటుంది. షర్ట్, ప్యాంట్, సూట్.. ఇలా వినియోగదారు తాను ఎంచుకున్న వస్త్రంతో ఏది కావాలంటే అది స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంటే కస్టమర్ నిజంగా వాటిని వేసుకున్నట్టే చూపిస్తుంది. వినియోగదారు తనకు నచ్చిన డిజైన్‌లో దుస్తులను సిద్ధం చేసుకోవచ్చన్న మాట.