భారతీయులు అత్యధికంగా వినియోగించే వర్క్ వీసాను రద్దుచేసిన ఆస్ట్రేలియా...పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజా నిబంధనల ప్రకారం పౌరసత్వం పొందాలంటే ఆంగ్లంపై పట్టు కలిగిఉండడంతోపాటు సుదీర్ఘకాల నివాసం ఉండాలి. కనీసం నాలుగేళ్లు ఇక్కడ నివసించడంతోపాటు ఆస్ట్రేలియా విలువలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒక వ్యక్తి పౌరసత్వ పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరుకావొచ్చు. అయితే తాజా సవరణల ప్రకారం మూడుసార్లు మాత్రమే పరీక్షకు హాజరుకావొచ్చు.