హోదా గళాలకు సంకెళ్లు | Manacles to the Status vocals | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 7:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

లక్షలాది మంది యువత భవిష్యత్తుకు ఆధారమైన ప్రత్యేక హోదా కోసం శాసనసభలో నినదించిన వైఎస్సార్‌సీపీ సభ్యులకు అసెంబ్లీ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇచ్చిన హోదా హామీ అమలు కోసం పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకోసం అలుపెరుగక ఉద్యమిస్తున్న ప్రతిపక్షానికి అడ్డంకులు సృష్టించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసినా ప్రత్యేక హోదా అంశాన్ని సభలో లేవనెత్తడమే తీవ్రమైన నేరమన్నట్లు నోటీసులు ఇవ్వడం పట్ల వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మనకు హక్కుగా సంక్రమించాల్సిన హోదా కోసం పోరాటం చేయడమే నేరమా? అని ప్రశ్నించింది. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement