సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి విడతగా రూ.10 కోట్లు చెల్లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి గురువారం ఆ మేరకు నగదును చెల్లించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు చెల్లింపు వివరాలను అందజేసినట్లు ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. మరో 17 కోట్ల రూపాయలు నిర్ణీత గడువులోగా చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ నెల 17న సదావర్తి భూముల వేలం కేసును హైకోర్టు మరోసారి విచారించనుంది.
రూ.10 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే
Published Fri, Jul 14 2017 9:21 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement