వరంగల్ జిల్లా నర్సంపేట స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన మంగళవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా దొంతి మాధవరెడ్డి కలవనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అయితే మాధవ రెడ్డి రాకను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే చక్రం తిప్పిన జానారెడ్డి దొంతి మాధవరెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావటంలో కీలక పాత్ర వహించారు.
Published Tue, Nov 4 2014 4:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement