ఖాట్మండ్‌లోని చారిత్రక ధరహరా భీమ్సేన్ శిఖరం కూలిపోయింది. ఈ శిఖరం కింద సుమారు 500 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక సిబ్బంది యత్నిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా 19వ శతాబ్దంలో ఈ శిఖరాన్ని నిర్మించారు. భూకంపం అనంతరం ఆ శిఖరం కూలి... శిథిలాలు మాత్రమే మిగిలాయి. అంచనాలకు అందనంతగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా ప్రాణా, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందిజ