ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు చెందిన ఐదుగురు బాలురు సిరియాలో తమ వద్ద బందీలుగా ఉన్న కుర్దిష్ తిరుగుబాటు దారులను దారుణంగా కాల్చి చంపారు. ఆ భయంకర వీడియోను ఐసిస్ విడుదల చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలుర వయసు సుమారు 10 -13 ఏళ్లు ఉంటుంది. ఆ వీడియోలో కనిపిస్తున్న క్యాప్షన్ ఆధారంగా బాలురలలో ఒకరు యూకేకు చెందిన వాడుగా.. అతని పేరు అబు అబ్దుల్లా ఆల్ బ్రిటాని అని తెలియవస్తుంది.