తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ కొరత లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత‍్వం ఏర‍్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కొరతను అధిగమించామని ముఖ‍్యమంత్రి కేసీఆర్ చెప్పారు. బుధవారం ఆయన అసెంబ్లీలో సభ‍్యులు అడిగిన ప్రశ‍్నలకు సమాధానం ఇచ్చారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ముందడుగు వేసిందన్నారు. తెలంగాణకు మెగావాట‍్ల విద్యుత్ అవసరంకాగా, 7371 మెగావాట‍్ల విద్యుత్ ఉత‍్పత్తి అవుతోందని వివరించారు. రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఉత‍్పత్తి సామర‍్ధ‍్యాన్ని పెంచేందుకు చర‍్యలు తీసుకుంటున్నామని చెప్పారు.