ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్ర వివాదాస్పదం అయ్యింది. బహిరంగ సభకు విచ్చేసిన జనాన్నిఅలరించేందుకు స్థానిక నేతలు మంగళవారం బార్ డాన్సర్‌తో అశ్లీల నృత్యాలు చేయించారు. భాగ్‌పత్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర ఏర్పాటు చేయగా.. కేంద్రమంత్రి సంజీవ్ బలయాన్, ఎంపీ సత్యపాల్ సింగ్ దీనికి హాజారు కావాల్సి ఉంది. అయితే సీనియర్ నేతలు సభాస్థలికి చేరుకోవడం కాస్త ఆలస్యం అయ్యింది. ఈలోపు వేదిక వద్దకు చేరుకున్న జనాన్ని అలరించేందుకు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. బీజేపీ నిర్వాకంపై మిగిలిన రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
Published Tue, Nov 8 2016 2:27 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement