దొరగారి కాపలా కుక్కలం కాదు... | revanth-reddy-slams-kadiyam-srihari | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 9 2015 10:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ టీడీపీ నేతలను కోతలనడం ఆయన విజ్ఞతకే వదలిస్తున్నామన్నారు. ఆయన సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కడియం శ్రీహరి ముందు తాను దళితుడని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కడియం సామాజిక వర్గంపై ప్రభుత్వం కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్లుతాగిన కోతులే రావణుడిని అంతం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. గోతికాడ నక్కలా... మాలమాదిగల రిజర్వేషన్‌ను కడియం కొట్టేశారన్నారు. కడియం కులంపై నిజనిర్ధారణ జరగాలన్నారు. తాము గోతికాడి నక్కలం కాదని, దొరగారి కాపలాకుక్కలం అంతకన్నా కాదని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ వానర సైన్యంగా ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. కడియం ముందు తాను ఏ సామాజిక వర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్? అసెంబ్లీ ఎక్కడి సభ్యుడిగా కొనసాగుతారో కడియం తేల్చుకోవాలన్నారు. రాష్ట్రమంత్రిగా ఉండి ఎంపీగా కడియం కొనసాగడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్లో మాలలు, మాదిగలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో మాదిగ, మాల, మహిళలకు స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. టీ.కేబినెట్లో మాల,మాదిగ, మహిళలకు స్థానం కల్పించాలంటూ తమ పార్టీనేత మోత్కుపల్లి నర్సింహులు ఇందిరాపార్క్ వద్ద దీక్షకు దిగుతున్నారన్ని, ఆ దీక్షకు అందరూ మద్దతు పలకాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇదే విషయంలో అవసరం అయితే సభను స్తంభింపచేస్తామని ఆయన తెలిపారు. మాల,మాదిగ, మహిళలకు న్యాయం జరిగేలా టీడీపీ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement