మాదాపూర్‌లోని మెరీడియన్ స్కూల్‌లో శనివారం ‘సాక్షి’, కె-సర్కిల్ సంస్థ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ క్విజ్-15 ప్రిలిమినరీ పోటీలకు విశేష స్పందన లభించింది. జంట నగరాలలోని 50 పాఠశాలలకు చెందిన 280 మంది 6 - 10వ తరగతుల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొన్నారు.