సాక్షి, కె -సర్కిల్ ‘స్కూల్ క్విజ్’కు అనూహ్య స్పందన
హైదరాబాద్: మాదాపూర్‌లోని మెరీడియన్ స్కూల్లో శనివారం ‘సాక్షి’, కె-సర్కిల్ సంస్థ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ క్విజ్-15 ప్రిలిమినరీ పోటీలకు విశేష స్పందన లభించింది. జంట నగరాలలోని 50 పాఠశాలలకు చెందిన 280 మంది 6 - 10వ తరగతుల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్‌లో ఈ క్విజ్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోృ ప్రతి జట్టులో ఇద్దరు విద్యార్థులుంటారు. ప్రతిభ కనబరిచిన 12 జట్లు సెమీఫైనల్, 4 జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.
సికింద్రాబాద్ వైఎంసీఏలోని కె-సర్కిల్ సంస్థ 1972 నుంచి క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ప్రతి శనివారం అన్ని రంగాలకు చెందిన వారికి క్విజ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాకులు తెలిపారు. క్విజర్స్ చెన్నై, బెంగళూరు, పూనే, కేర ళ, ముంబై నుంచి వచ్చారు. ఈ సందర్భంగా కె-సర్కిల్ అధ్యక్షులు ప్రసన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రొత్సహించేందుకే ‘సాక్షి’తో కలసి స్కూల్ క్విజ్‌ను నిర్వహిస్తున్నామని దీని ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయవచ్చన్నారు.