వరుస ఆందోళనలతో సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ విపక్ష పార్టీలపై అధికార బీజేపీ వ్యాఖ్యాలు చేసిన నేపథ్యంలో అంతకు రెట్టింపు స్వరంతో, ఘాటైన పదజాలంతో బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరేముందు సోనియా మీడియాతో మాట్లాడారు.