ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పందెం గ్రామం సమీపంలోని పొలంలో లభ్యమైన శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి బంగారు నాణాలను బయ్యూరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వీరేశ్వర్‌రావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఐదు నెలల క్రితం ధర్మసోత్ సుందర్ అనే రైతు తన పొలంలో దుక్కు లు దున్నిన తర్వాత కురిసిన భారీ వర్షానికి ఇత్తడి బిందె బయట పడింది. పశువులకు కాపలాగా వెళ్లిన పెనక నర్సయ్య, బచ్చలి వెంకన్న, ధర్మసోత్ ధను, ఇస్లావత్ లాల్‌సింగ్‌లకు ఈ బిందె లభించింది. అందులోని నాణేలను 10 చొప్పున పంచుకున్నారు.