పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ లోక్‌సభలో బిల్లు ఆమోదించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ పిలుపు మేరకు శనివారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. బోనాల నేపథ్యంలో మినహాయింపు ఇచ్చిన సికింద్రాబాద్ మినహా తెలంగాణవ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. పది జిల్లాల్లోనూ దాదాపుగా జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు ముందే సెలవు ప్రకటించాయి.