కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లోక్ సభలో స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన చేపట్టడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఒక ప్రధాన పార్టీకి చెందిన అధ్యక్షురాలు లోక్ సభ వెల్ లోకి రావడం దేశ చరిత్రలో తొలిసారి అని చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ లో ప్రతిపక్షాల తీరు అభ్యంతరకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అకారణంగా వర్షాకాల సమావేశాలను అడ్డుకుందని ఆరోపించారు. పార్లమెంట్ ను స్తంభింపజేయడం వల్ల కాంగ్రెస్ సాధించింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ప్రసంగానికి, నినాదానికి తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.