రాష్ట్రంలో 2019 కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2018 చివర్లో.. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించా రు. మంత్రులు, పార్టీ నేతలతో మాట్లాడారు.