ఎర్రచందనం దుంగలను తరలిస్తూ టీడీపీ మహిళా నేత ఒకరు పోలీసులకు పట్టుపడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు ఏకుల రాజేశ్వరి శుక్రవారం తన స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో బద్వేలువైపు బయల్దేరారు. ఓ మహిళ ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారమందడంతో అట్లూరు పోలీసులు అప్రమత్తమై.. కడప-బద్వేలు మార్గం మధ్యలో ఆమె వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.