శనివారం వెల్లడైన గోవా అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ.. రాష్ట్రంలోని 40 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 21 స్థానాలను గెలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ 17 స్థానాలు సాధించింది. బీజేపీ 13 స్థానాలను గెలుచుకోగా.. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండిపెండెంట్, ఇతర చిన్న పార్టీల తరఫున గెలుపొందిన అభ్యర్థుల మద్దతు తప్పనిసరైంది.