'స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్'.. ఈ మాట ఎన్ని సంవత్సరాల నాటిదైనా ఇప్పటికీ దాని విలువ అలాగే ఉంది. పెళ్లికి ఎంత ఖర్చవుతుందో చావుకు కూడా దాదాపు అంతే ఖర్చవుతోంది. అది భరించలేని వాళ్లకు నరకం కళ్లెదుటే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో కొడుకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి దగ్గర డబ్బులు లేకపోవడంతో... రాత్రంతా ఆ శవాన్ని కళ్లెదుటే పెట్టుకుని జాగారం చేయాల్సి వచ్చింది.