రావణ దహనం అంటే చెడును అంతం చేయడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన దసరా వేడుకల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. రాంలీలా మైదానంలో వైభవంగా నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాముడు, కృష్ణుడు జన్మించిన పుణ్యభూమిలో దసరా జరుపుకోవడం మహద్భాగ్యంగా వర్ణించారు.