కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో శుక్రవారం ఓ జంటపై జరిగిన యాసిడ్‌దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రాణి శనివారం ఉదయం మృతిచెందింది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడు రాజేష్ తో కలిసి బైక్ పై వెళ్తున్న రాణి పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా కాలిపోయిన ఆమె బైక్ పై నుంచి పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అప్పటినుంచి విజయవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.