ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విరసం నేత చలసాని ప్రసాద్ (83) శనివారం కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో ఇవాళ ఉదయం 11.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. అంబులెన్స్ చేరుకునే లోపు చలసాని ప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు. సాంస్కృతిక సాహిత్య ఉద్యమంలో చలసాని ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకుల్లో ఆయన ముఖ్యులు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చలసాని ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. శ్రీశ్రీ, కొడవటిగంటి, రావిశాస్త్రి, తదితరులతో సాన్నిహిత్యం ఉంది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కాగా చలసాని ప్రసాద్ కు ఇద్దరు కుమార్తెలు.