స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనందునే బార్సిలోనాను ఇస్లామిక్ తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిపారు. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని ఆధునిక తుపాకులు, బాంబులతో జనాలలోకి చొచ్చుకు పోవడం కుదరడంలేదు కనుకనే టెర్రరిస్టులు జనంపైకి వాహనాలను నడపడం ద్వారా దాడులకు పాల్పడుతున్నారు.