ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు హెలికాప్టర్లలో తిరగడమే సరిపోయింది కానీ, వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించే తీరిక లేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా రెడ్డిగూడెంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాధితులను పరామర్శించారు.