సీబీఐ అయితే తన్ని లోపల వేస్తుంది | ys jagan mohanreddy takes on chandrababu naidu in ysrcp save visakha maha dharna | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 22 2017 1:53 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే మహాధర్నా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ధర్నాతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి రావాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాగా మారారని ధ్వజమెత్తారు. భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న పెద్ద మొత్తం భూకుంభకోణంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇసుకవేస్తే రాలనంత స్థాయిలో జనాలు తమ గోడును వినిపించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేసే ప్లాన్‌ చేశారని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement