దసరా ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య ప్రముఖుల ఆహ్వానం మేరకు శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.