న్యాయం చేయలేకపోతే సమైక్యంగా ఉంచండి | YS Vijayamma Regional Conference speech at Gannavaram | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 24 2013 4:41 PM | Last Updated on Wed, Mar 20 2024 3:58 PM

సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. దీక్ష విమరణ అనంతరం ఆమె గన్నవరం విమానాశ్రయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యాయం చేయలేనప్పుడు విభజించే హక్కు లేదని అన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న రాష్ట్ర ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేసినా... జగన్ జైల్లో దీక్ష చేపడతానన్నారని ఆమె తెలిపారు. తన ఆరోగ్య దృష్ట్యా దీక్ష విరమించాలని జగన్ కోరారని విజయమ్మ పేర్కొన్నారు. అన్నదమ్ములు లాంటి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనే జగన్ కలత చెందాడని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలందరి కోసం జగన్‌ దీక్ష చేస్తున్నాడని.... తన బిడ్డను ఆశీర్వదించాలని విజయమ్మ ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రానికి, జగన్‌ బాబుకు మంచి జరగాలని ఆమె అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎన్నో జల యుద్ధాలు ఉన్నాయని, వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూశారన్నారు. విభజిస్తే సీమాంధ్రకు ఉప్పునీళ్లే గతి అన్నారు.శ్రీశైలానికి, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారనొ దీనికి నీళ్లు ఎలా ఇస్తారని అన్నారు. మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడవని....అందుకే కృష్ణానది ఉన్న ప్రాంతం ఒకే రాష్ట్రంలోఉండాలని విజయమ్మ కోరారు. అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని సూటిగా ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర బడ్జెట్లో 45 శాతానికిపైగా ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోందని...తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్‌ ఇస్తే.. మిగతావాళ్ల పరిస్థితి ఏంటని విజయమ్మ అడిగారు. అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసని...ఆదాయం అంతా ఒకే ప్రాంతానికి పోతే మిగతావాళ్ల పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాష్ట్రాలు ఎలా నడవాలి... ఎలా నడిపించాలన్నారు. సీమాంధ్రలో చదువుకునే యువతకు ఉద్యోగాలు ఎక్కడనుంచి వస్తాయని, హైదరాబాద్‌లో ఉంటున్నవారికి ఎలా భద్రతను కల్పిస్తారని అడిగారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంవల్ల గతంలో విభజన వెనక్కిపోయిందని విజయమ్మ అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపని ఎందుకు చేయలేకపోయారని ఆమె అడిగారు. ఎమ్మెల్యేల చేత కూడా ఆయన ఎందుకు రాజీనామాలు చేయించలేకపోయారని...సుమారు 89 మంది ఎమ్మెల్యేలు ఉండికూడా చంద్రబాబు ఆపని చేయలేకపోయారన్నారు. రాజీనామా చేసి చంద్రబాబు ప్రజల్లోకి వస్తే బాగుంటుందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement