రాజకీయాల్లో నైతిక విలువలకు, విశ్వసనీయతకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునాది వేశారని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అలాంటి వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు భూతాలు, ప్రేతాత్మలుగా మారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని చెబితే అలా ఎందుకు అంటున్నారో అనే విషయం ఆలోచించుకోవాల్సిందిపోయి, ఆ దుర్మార్గపు పాలనను ఎండగట్టడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నాయని మండిపడ్డారు.