కృష్ణానదిపై సోమ శిల– సిద్ధేశ్వరం వంతెనను త్వరగా పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలం గాణ డిమాండ్ చేసింది. రాయలసీమ నుంచి కృష్ణానది మీదుగా పుట్టీలో వస్తూ పాత పాల మూరు జిల్లా మంచాలకట్ట వద్ద 61 మంది జలసమాధి అయి పదేళ్లు కావొస్తోందని ఆ పార్టీ పేర్కొంది. ఈ ఘటనకు ఆనాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలించిపోయి కృష్ణా నదిపై రాకపోకలకోసం సోమశిల–సిద్ధేశ్వరం వంతెనకు నిధులు మంజూరు చేసిన విష యాన్ని గుర్తుచేసింది. వైఎస్సార్ మరణం తర్వాత పలువురు సీఎంలు మారారని, కానీ ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి గున్‌రెడ్డి రాంభూపాల్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.