కంగారూలు చాలా విచిత్రమైన జంతువులు. అవి అచ్చం మనుషుల్లాగే రెండు కాళ్లతో పరిగెత్తగలవు, నాలుగు కాళ్లతోనూ నడుస్తాయి. వేరే జంతువులతో పోరాడుతాయి. మనుషులతో బాక్సింగ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అడవి లాంటి ప్రాంతంలో ఒక కుక్కను కంగారూ తన ముందుకాళ్లతో పీక పట్టుకుని దాంతో ఫైటింగ్ చేస్తుంటే.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెళ్లి దాన్ని అదిలిస్తాడు. అతడు రావడం చూసి కుక్కను మరింత గట్టిగా పట్టుకుంటుంది. అతడు వాటికి దగ్గరగా వెళ్లి దాన్ని బెదిరించేసరికి, కుక్కను వదిలిపెట్టి.. అతడితో పోరాటానికి సై అంటుంది