ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలై సిరీస్ ను పేలవంగా ప్రారంభించింది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం 441 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్(2) తో మొదలైన పతనకం కడవరకూ కొనసాగింది.