శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 191 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 252/2, వ్యక్తిగత స్కోరు 98 వద్ద ఫోర్ కొట్టి టెస్లుల్లో 11వ శతకాన్ని నమోదు చేశాడు. కానీ సెంచరీ చేసిన అనంతరం కౌశల్ బౌలింగ్లో జట్టు స్కోరు 255 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా మూడో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ 121 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.