హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత టాప్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సైనా 21-18, 9-21, 21-16 స్కోరుతో సయాకో సాటో (జపాన్)పై విజయం సాధించింది. తొలి గేమ్ విజయం తర్వాత రెండో గేమ్‌లో చిత్తరుున సైనా... కీలక సమయంలో కోలుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 51 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఏకపక్షంగా సాగిన మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21-10, 21-14తో సు చింగ్ (చైనీస్ తైపీ)ని 36 నిమిషాల్లో చిత్తు చేసింది.
Published Fri, Nov 25 2016 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement