ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లోనూ అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్ 14–21, 22–20, 21–7తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.